Sunday, December 1, 2024

ఇప్పుడు ఏ మాత్రం రిలాక్స్‌ కావొద్దు.. అదే జరిగితే..

Do not Relax says CM YS Jagan: వైసీపీ పరిపాలనలో 20 నెలలు అంటే.. దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంటే మిడిల్‌ ఓవర్లలోకి వచ్చామన్న మాట. కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సీఎం సూచించారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలోని క్యాంపు‌ కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఒకవేళ అదే (రిలాక్స్) జరిగితే మనం వెనకబడిపోక తప్పదు. అందువల్ల ఇప్పుడు మనమంతా దృష్టిని తిరిగి కేంద్రీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమేం చేశాం? అంతా సవ్యంగా జరిగిందా? ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్ని శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉందా? ఏమైనా లోపాలున్నాయా? ఉంటే ఎలా సవరించుకోవాలి? వంటి విషయాలపై వెంటనే దృష్టి పెట్టాల్సి ఉంది. ఆ మేరకు అన్నింటినీ మరోసారి ట్యూన్‌ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్‌ ఓవర్లలో ఉన్నాం. సహజంగా ఈ సమయంలో అందరూ బ్రేక్‌ తీసుకోవాలనుకుంటారు. కానీ అది జరగకూడదు. అప్పుడు మరింత ముందుకు వెళ్లగలుగుతాం అని అధికారులతో జగన్ తెలిపారు.

నిబద్ధతకు ప్రతిరూపం..
కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం చేపట్టిన టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ, ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ విధానం. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పరిపాలనలో నిబద్ధతకు ఇది ప్రతిరూపంలా నిల్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో విద్యాబోధన, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం, గత వందేళ్లలో ఏనాడు జరగని భూముల సమగ్ర రీసర్వే అని సీఎం తెలిపారు.

అవినీతిరహితం-డీబీటీ..
వీటన్నింటికి మించి వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానం. ఎక్కడా దళారీలకు, అవినీతికి తావు లేకుండా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ. ఆ విధంగా దాదాపు రూ.90 వేల కోట్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేయడం జరిగింది అని జగన్ అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x