Sunday, December 1, 2024

లీవ్ కోసం ఇతను ఆడిన అబద్ధం చూస్తే దిమ్మతిరిగి పోవడం ఖాయం!

ఆఫీసులో సెలవులు కావాలంటే చాలా మంది ఉద్యోగులు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం పరిపాటే. ఇలాంటివి చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చిన్నప్పుడు స్కూలు సెలవు కోసం కడుపు నొప్పంటూ అబద్ధం చెప్పడంతో ఇది మనకు అలవాటైపోతుంది. కానీ జీవితంలో ఎదిగిన తర్వాత ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకునో మారతాం. కానీ కొందరు మాత్రం మారరు. అంతేకాదు వయసుతో పాటు తమ అబద్ధాల స్థాయి కూడా పెంచుతూ పోతుంటారు. ఇలాంటి కథే అమెరికాలోని అరిజోనాలో వెలుగు చూసింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న 19 ఏళ్ల ఎంప్లాయీకి సెలవు కావాల్సి వచ్చింది. ఆఫీసులో ఏదో ఒకటి చెప్పి లీవ్ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ లీవ్ దొరకడం కష్టమని అర్థం అయింది. అంతే భయంకరమైన ప్లాన్ వేసి.. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు.

అర్థం కాలేదా? అయితే మొత్తం చదవాల్సిందే.. అరిజోనాలోని వాటర్ టవర్ సమీపంలోని ఒక టైర్ ఫ్యాక్టరీలో పనిచేసే బ్రాండన్ సోల్స్ అనే యువకుడు తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీకి కొద్ది దూరంలో సోల్స్ బందీగా పడివుండటాన్ని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూశాడు.

ఆ సమయంలో సోల్స్ చేతులు బెల్ట్‌తో కట్టేసివున్నాయి. అరవకుండా ఉండేందుకు అతని నోటిలో ఏవో కుక్కేసి కనిపించాయి. ఇవన్నీ చూస్తే సోల్స్‌ను ఎవరో కిడ్నాప్ చేశారనే అనిపిస్తుంది. అతన్ని అలా చూసిన వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోల్స్‌ను విడిపించారు. పోలీసుల విచారణలో సోల్స్ తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపాడు. తనను ఓ కారులో ఎక్కడికో తీసుకువెళ్లి, తిరిగి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారని తెలిపాడు. తన తండ్రి నగరంలో ఎక్కడో డబ్బులు దాచాడని, వాటికోసమే తనను కిడ్నాప్ చేశారని చెప్పాడు. అయితే సోల్స్ పనిచేస్తున్న కంపెనీకి చెందిన అధికారులు విచారించగా అతను చెబుతున్నది అబద్ధమని తేలింది. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కొంచెం బలంగా విచారించగా.. కంపెనీలో సెలవు కోసమే కిడ్నాప్ డ్రామా ఆడానని సోల్స్ ఒప్పేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కంపెనీ.. అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x