Monday, September 21, 2026

Cloves: లవంగాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయ్.. అవేంటంటే

మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎన్నో జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చనే విషయం కొందరికీ మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఇంట్లో ఉండే లవంగాల వల్ల ఉపయోగం తెలిస్తే అంతా ఔరా అనక మానరు. ఈ సుగంధ ద్రవ్యం వాడటం తెలుసుకోవాలేగానీ.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. కానీ దీని వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. లవంగాలు వైద్యపరమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

లవంగాల వల్ల ఉపయోగాలు:

– లవంగాలని తరచూ వాడడం వలన రక్తపోటు (బి.పి) అదుపులో ఉంటుంది.

– జలుబు చేసినప్పుడు పొడి దగ్గు వస్తుంది. అలాంటి సమయంలో రెండు లవంగాలని నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని మింగాలి. అలా చేస్తే పొడి దగ్గు తగ్గుతుంది.
– పంటి నొప్పి ఉన్నవారు ఈ లవంగాల పొడిని, ఇంకా తులసి ఆకుల పొడిని కలిపి నొప్పి ఉన్న చోట పెట్టినట్లైతే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
– నోటి నుంచి అప్పుడప్పుడు దుర్వాసన వస్తున్నపుడు ఈ లవంగాలను తినడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది.
– లవంగాలను రోజూ రెండు కానీ మూడు కానీ తింటూ ఉంటో శరీరంలో ఉంటే విషపదార్థాలన్ని బయటకు పోతాయి.
– అధిక తలనొప్పితో బాధపడేవారు రోజూ రెండు లవంగాలు తింటే.. చాలా బాగా ఉపశమనం కలుగుతుంది.
– లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి

ఒక్కటేమిటి.. ఇలా ఎన్నో ఉపయోగాలు లవంగాలతో ఉన్నాయి. ఒక్క మసాలా ఐటమ్ గానే కాకుండా మహా ఔషధం కూడా లవంగాలు ఉపయోగపడతాయని తెలుస్తుంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా లవంగాలను వాడి.. ఉన్న బాధల నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేయండి. ఇంకా లవంగాల వల్ల ఉపయోగాలేంటి.. మరో అప్‌డేట్‌లో తెలుసుకుందాం.

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -