Sunday, December 1, 2024

Petrol Price Hike: పెట్రోలు ధర ఇలా పెరుగుతున్నా.. ఎవరూ మాట్లాడరేం?

ఒక సినిమాలో కొంచెం అభ్యంతరకరమైన సీన్ ఒక్కటి ఉంటే చాలు.. మనోభావాలు అంటూ కొన్ని సంఘాలు ఎలా హడావుడి చేస్తాయో.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ సినిమాలో ఆ సీన్ వల్ల ఎవరికి, ఎంత నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్‌గా సీన్ సితార్ అయ్యేలా జనాలపై కొన్నింటిని మండిస్తుంటే.. స్పందన మాత్రం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలంటూ చెప్పుకుంటాం.. కానీ.. రెండూ లాలూచీ వ్యవహారంగానే ఉంటాయనే విషయం కూడా కొన్ని సందర్బాలతో జనాలకి అవగతం అవుతుంది. జనాలకు నష్ట వాటిల్లే.. పనులు అధికార ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు.. ప్రజల గొంతుకగా నిలిచి, ప్రతిపక్షాలు పోరాడాల్సి ఉంటుంది. అసలు ప్రతిపక్షాలు ఉన్నాయా అనేలా ఇప్పుడు పాలనలు సాగుతున్నాయి. లేదంటే పెట్రోలు ధరలు లీటరు దాదాపు రూ . 100 రూపాయలకు చేరుకున్నా.. ఎవరూ ఒక్కరు కూడా స్పందించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పెట్రోలు ధరలు రూ. 90 దాటి సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. కొన్ని స్టేట్స్‌లో రూ. 100 మార్కును కూడా దాటేశాయి. ఇలా పెట్రోల్ ధరలు లెక్కలేకుండా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడే లేడు. అదే సినిమా పోస్టర్ మీద ఏదైనా చిన్న అభ్యంతరం ఉంటే మాత్రం ధర్నాలు, రాస్తారోకోలతో మంటలు మండించేస్తారు. మరి దేనివల్ల ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారనే దానిపై మాత్రం ఎవరూ ఆలోచించరు. ఆలోచించే శక్తి కూడా ఎవరికీ లేదు. అదేంటయ్యా.. అంటే.. అది మనవాళ్ల తప్పు కాదు.. ఇంధన ధరలు అలా ఉన్నాయి అని కవర్ చేయడం.

ఇటీవల ఆయిల్ కంపెనీలు ధరల మోత మోగిస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని చెబుతున్నారు. మనదేశంలో, రాజస్థాన్‌లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీగంగనార్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటితే సాధారణ పెట్రోల్ ధర రూ. 98.40కి చేరింది. మళ్లీ ఈ ప్రీమియం, సాధారణం ఏంటని అనుకుంటున్నారా? ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం. ప్రీమియం పెట్రోల్, సాధారణ పెట్రోల్ మధ్య ప్రధానమైన తేడా ఆక్టేన్ నెంబర్. సాధారణ పెట్రోల్‌కు ఈ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇంధనం యొక్క మండే నాణ్యత కొలతను ఆక్టేన్ నెంబర్‌ అంటారు.

రానున్న రోజుల్లో పెట్రోలు, డిజీల్ ధరలు మరింత మండే అవకాశం లేకపోలేదు. సో.. ఇప్పుడైనా కాస్త ఈ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెడితే బాగుంటుంది. లేదంటే సామాన్యుడికి సైకిలే దిక్కు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x