Sunday, March 22, 2026

డేవిడ్‌ వార్నర్‌ వీడియో.. ఈ సినిమా, హీరో ఎవరో కనిపెట్టండి?

ఈ మధ్య కాలంలో ఒక క్రికెటర్.. డాన్సర్ గా, యాక్టర్‌గా మారి అందరిని అలరిస్తున్నాడు. అది కూడా మన తెలుగు వాడు కాదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇతనికి మన దక్షిణాది సినిమాలన్నా, హీరోలన్నా మక్కువ ఎక్కువ. ఆ కారణంగానే ఇతను తెలుగు సినిమా హీరోలని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ లు, యాక్టింగ్ లు చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. బుట్ట బొమ్మ సాంగ్ కి భార్యతో సహా స్టెప్పులేసి మెప్పించాడు. బాహుబలి సినిమాలోని ప్రభాస్ డైలాగ్ చెప్తూ వీడియో పోస్ట్ చేశాడు. పేస్ ఆఫ్ యాప్ ద్వారా కొంతమంది హీరోల ఫేస్‌లని మార్చి, వారి ఫేస్‌ల స్థానంలో తన ఫేస్ పెట్టి వీరలెవల్‌లో ఇమిటేట్ చేస్తున్నాడు. ఆయన పెట్టిన వీడియోలకు నెటిజన్ల నుంచే కాకుండా.. సదరు హీరోల నుంచి కూడా రిప్లయ్‌ వస్తుండటం విశేషం.

దీనితో వార్నర్‌ అంటే.. ఆయన వేరే దేశపు జట్టు సభ్యుడు అయినప్పటికీ.. తెలుగువారు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. అందులోనే ఆయన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక బ్యాట్స్‌మెన్‌ కూడానూ. మరో విశేషం ఏమిటంటే.. వార్నర్‌తో పాటు వారి పిల్లలు కూడా ఈ వీడియోలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ.. వావ్‌ అనిపిస్తుంటారు. ఆయన చేసే వీడియోలతో మన టాలీవుడ్‌ దర్శకులు ఏదైనా సినిమా ప్లాన్‌ చేసినా చేయవచ్చు అనేలా కూడా వార్తలు నడిచాయి.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)


వార్నర్‌ ఇప్పటి వరకు బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌తో పాటు మహేష్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్, వంటి వారి చిత్రాల డైలాగ్స్‌ చెబుతూ వీడియోలు షేర్ చేశాడు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుంచి కూడా టీజర్‌ డైలాగ్‌ని రీఫేస్ చేశాడు. ఈ మధ్య మహేష్ బాబు పాల పిట్ట సాంగ్ లో తళుక్కున మెరిశాడు. ఇప్పుడు దళపతి విజయ్ సినిమా ‘మాస్టర్‌’ నుంచి కూడా ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసి.. ఇది ఏ సినిమాలోదో, యాక్టర్‌ ఎవరో.. చెప్పి.. వీడియోకి క్యాప్షన్‌ ఇవ్వండి అని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -