Monday, March 23, 2026

చైతూకి పరశురామ్ పాతబాకీ తీర్చాల్సిందే..

Naga Chaitanya – Parasuram తెలుగు సినీ పరిశ్రమలో కాంబినేషన్‌ల సెటప్ అనేది బిగ్గెస్ట్ సెటప్. ఏ కాంబినేషన్ ఎప్పుడూ కుదురుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు సర్‌ప్రైజింగ్ కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అలాంటి కలయికే పరశురామ్-మహేష్‌బాబులది. ఈ ఇద్దరి కలయికలో సర్కారు వారి పాట అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ జోడి కుదరకముందే పరశురామ్-అక్కినేని నాగచైతన్య సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించుకుంది. తీరా సెట్స్‌కు వెళ్లే సమయానికి అందరిని ఆశ్చర్యపరుస్తూ మహేష్- పరశురామ్ సినిమాను ప్రకటించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ పాతబాకీని తీర్చాల్సిందేనని.. సర్కారు వారి పాట విడుదల కాగానే చైతుతో సినిమా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు 14రీల్స్ సంస్థ అధినేతలు. సో.. పరశురామ్ చైతుకు ఒక సినిమా చేసి పాతబాకీ తీర్చాల్సిందే..

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -