Tuesday, March 24, 2026

ప్రేమికుల కోసం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ ట్రీట్ ఇస్తున్నాడు

Tuck Jagadish Lyrical Song: న్యాచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోహీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని ప్రేక్షకులకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్‘. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. సంగీత సంచలనం ఎస్.ఎస్‌. థమ‌న్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్‌. ఆయ‌న సంగీతంలో రూపొందిన ‘ఇంకోసారి ఇంకోసారి’ అనే పాట లిరిక‌ల్ వీడియోను ఫిబ్ర‌వ‌రి 13 ఉద‌యం 9 గంట‌ల‌కు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియ‌జేసింది. ఈ పాట‌‌ను చిత్రంలో నాని, రీతు వ‌ర్మ జంట‌పై చిత్రీక‌రించారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఆ పోస్ట‌ర్‌లో కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకుగా రెడీ అవుతున్న నాని లుక్ వైర‌ల్ అయ్యింది. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో పాటు ర‌చ‌న కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాంకేతిక బృందం:
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌ణ్‌ ముసులూరి
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -