శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్ లో సుహాసిని, వినోద్ కుమార్ ప్రధాన జంటగా,శ్రీనివాస్ అనంతనేని , మౌనిక హీరోహీరోయిన్లుగా బీమ్ జీ దర్శకత్వం లో పెంటి నాగరాజు, పెంటి ధీరజ్ సందీప్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్ టైన్ లవ్ స్టోరీ ” ఓ మాట అనుకుందామా”. ఈ చిత్రం ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుహాసిని మణిరత్నం ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాతో ముచ్చటించారు.
“ఒక అందమైన ఫ్యామిలీ డ్రామా తో కూడిన ప్రేమకథ “ఓ మాట అనుకుందామా”. ఈ స్టోరీ నాకు ఎంతో నచ్చింది, సినిమా కూడా అంతే కలర్ ఫుల్ గా వచ్చింది. ఈ చిత్రం లో నేను మీ సుహాసిని మణిరత్నం మరియు వినోద్ కుమార్ ప్రధాన జంటగా, మరియు అనంతనేని శ్రీనివాస్ & మౌనిక మిశ్ర మరో జంటగా నటిస్తున్నాం. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తయింది అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాం అని అన్నారు.
శ్రీనివాస్ అనంతనేని, మౌనిక మిశ్రా, సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, కార్తికేయ దేవ్, అజాజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
డి ఓ పి: సుక్రీత్ కె ఎస్
మ్యూజిక్; అలోస్య పీటర్ -వినోద్ యాజమాన్య
ఎడిటింగ్ సత్య గిడుటూరి
లిరిక్స్: పూర్ణాచారి, గణేష్ ఆముల్ల గిరి, శ్రీనివాస్
సింగర్స్: శాంతి చాగంటి, రమ్య బెహరా, స్వరాగ్ కీర్తన్, అఖిల్ దేవ్, దాసరి మేఘనా నాయుడు
కొరియోగ్రఫీ: ప్రశాంత్ బాలకృష్ణ, రామ్ ఇసుక పాటి
పిఆర్ఓ :వీరబాబు బాసిo శెట్టి
కో డైరెక్టర్: రామరాజు టి., అనిల్ లక్ష్మణ్, తేజ ఆచార్య
ప్రొడ్యూసర్స్
పెంటి నాగరాజు (M.A.)
పెంటి నీరజ్ సందీప్ (M.B.A., సింగపూర్)
స్టోరీ – స్క్రీన్ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ : భీమ్ జి




