Tuesday, March 24, 2026

Vijay: విజ‌య్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం

లైగ‌ర్ ప‌రాజ‌యంతో కాస్త నిరుత్సాహ‌ప‌డ్డ రౌడిబాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండకు ఖుషి కాస్త ఊర‌ట నిచ్చింద‌నే చెప్పాలి. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఖుషికి కాస్త మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా క‌లెక్ష‌న్లు మాత్రం ఆశాజ‌న‌కంగానే వున్నాయి. విజ‌య్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ను ఖుషి సాధించిద‌ని చెబుతున్నారు మేక‌ర్స్‌. ఇదిలా వుండ‌గా టాలీవుడ్‌లో బిగ్‌స్టార్ మొద‌లుకొని మీడియం స్టార్ వ‌ర‌కు సినిమా విడుద‌ల త‌రువాత సినిమా విజ‌యం సాధించింద‌ని తెలియ‌జేయ‌డానికి సినిమా టీమ్‌తో క‌లిసి తిరుప‌తికి వెళ్లి వెంక‌టేశ్వ‌ర స్వామిని సంద‌ర్శించుకుంటారు.అక్క‌డ కాస్త మీడియాతో హ‌డావుడి చేసి వ‌స్తుంటారు. అది అన‌వాయితిగా వ‌స్తుంది.

అయితే విజ‌య్ దేవ‌రకొండ ఈ విష‌యంలో కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టారు. ఖుషి సినిమా టీమ్‌తో క‌లిసి విజ‌య్ నేడు యాద‌గిరి గుట్ట‌లోకి శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకుని ఆశ్శిస్సులు అందుకున్నారు. విజయ్‌తో పాటుఆనంద్‌ దేవ‌ర‌కొండ‌, గోవ‌ర్థ‌న్ దేవ‌ర‌కొండ‌, విజ‌య్ తల్లి మాధ‌వి, ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ‌, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌లు కూడా యాద‌గిరి గుట్ట‌కు వెళ్లి ఆశ్శీస్సులు అందుకున్నారు. ఇక విజ‌య్ శ్రీ‌కారం చుట్టిన ఈ సంప్ర‌దాయాన్ని ఎంత మంది సెంటిమెంట్‌గా పాటిస్తారో చూడాలి. ఇటీవ‌ల యాద‌గిరి గుట్ట దేవాల‌యాన్ని వంద‌ల‌కోట్లు ఖ‌ర్చుపెట్టి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేసిన సంగ‌తి తెలిసిందే

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -