Politics

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్:
యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు. శతాబ్ద కాలంగా క్రియాయోగానికి సంబంధించి వై ఎస్ ఎస్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందకు చిరంజీవి హైదరాబాదులో ఓ మీడియా సంస్థ తరఫున ఉగాది పురస్కారాన్ని అందజేశారు. స్వామీజీకి శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా స్వామి స్మరణానంద మాట్లాడుతూ మనసుకు, శ్వాసకు సంబంధం ఉందన్నారు. శ్వాసను నియంత్రించడం ద్వారా ఆలోచనలను ప్రభావితం చేయవచ్చని, మనసును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. క్రియాయోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద 1917లో వైఎస్ఎస్ ను స్థాపించారని ఆయన గుర్తు చేశారు. క్రియాయోగ ధ్యానానికి సంబంధించిన పాఠాలను వై ఎస్ ఎస్ నుంచి పోస్ట్ ద్వారా పొందవచ్చని స్వామీజీ సూచించారు.

స్వామి స్మరణానంద ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థిగా ఉన్నప్పుడే పరమహంస యోగానంద రచనల వైపు ఆకర్షితులయ్యారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినా ఆధ్యాత్మిక రంగంలోనే కొనసాగాలనుకుని వై ఎస్ ఎస్ లో చేరారు. 4 దశబ్దాలుగా సేవలందిస్తున్నారు. వై ఎస్ ఎస్ సంస్థ తరపున అనేక విద్య, సేవాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాచీన కాలం నాటి క్రియాయోగాన్ని వై ఎస్ ఎస్ గురుపరంపర జన బాహుళ్యంలోకి తీసుకువచ్చింది. పరమహంస యోగానంద 1920 నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో క్రియాయోగ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM