ఫోన్స్ కి, నెట్ లకి రీఛార్జ్ చేయించినట్లు ఇకపై కరెంట్ కి కూడా ముందే రీజార్జ్ చేయించాలంట. ఇదెక్కడి విడ్డూరం
ఫోన్స్ కి, నెట్ లకి రీఛార్జ్ చేయించినట్లు ఇకపై కరెంట్ కి కూడా ముందే రీజార్జ్ చేయించాలంట. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారు కదా. అదే మరి మా పాలనా పనితీరు అంటుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎంత కరెంట్ వాడితే అంత మాత్రమే బిల్లు కట్టాల్సి ఉండేది. కానీ ఇకనుండి ముందు రీజార్జ్ చేసుకోండి.. అది చాలకపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంట. అలా చేయించని పక్షంలో అన్ని లైట్లు, ఫ్యాన్లు మాత్రమే కాదు మిగతా అన్ని రకాల వస్తువులు బంద్. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం ప్రీ పెయిడ్ కరెంట్ మీటర్లను బిగించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటిగా దీనిని ప్రభుత్వ రంగ సంస్థలలో అందుబాటులోకి తీసుకురానున్నారు అధికారులు.
అసలు ఉన్నట్లుండి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఎన్నో. చాలా రకాల ప్రభుత్వ సంస్థలు, ప్రయివేట్ సెక్టార్లకి సంబంధించిన వాటిల్లో కరెంట్ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని వసూలు చేయడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. దీనివలన విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం ఈ ప్రీ పెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర అభయాన్ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చి లోపు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉన్న పోస్ట్ పెయిడ్ మీటర్ల స్థానంలో ఈ ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతి నెలా రెండు శాతం చొప్పున విద్యుత్ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల పాటు వీటి పనితీరును పరిశీలించిన తరువాత అపార్ట్ మెంట్స్, ఇళ్లకు కూడా ఈ ప్రీ పెయిడ్ మీటర్లు అమరుస్తారు. ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఈ మీటర్లకు రీజార్జ్ చేసుకోవడం ఉంటుంది. ముందుగా ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని, విద్యుత్ బిల్లులు కూడా మొబైల్ బిల్లు లానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రజలు విద్యుత్ ని సమర్ధవంతంగా వాడుకోవడం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…