Monday, March 23, 2026

Son Of India: ‘స‌న్నాఫ్ ఇండియా’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

డాక్టర్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఓ చిత్రం చేస్తున్నారంటే.. ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో తెలియంది కాదు. భారతీయ సినిమా యొక్క అత్యంత బహుముఖ నటులలో ఒకరైన మోహన్ బాబు.. చిత్రనిర్మాణంలో ప్రతి విభాగం గురించి లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు. తాజాగా ఆయన చేస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సన్నాఫ్ ఇండియా’కు స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం విడుద‌ల‌ చేసింది చిత్రయూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో డాక్టర్ మోహన్ బాబు మెడ‌లో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

మోహన్ బాబు కొత్త హెయిర్‌డోతో పూర్తిగా భిన్నమైన గెటప్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం గడ్డం కూడా పెంచుకున్నారు. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్ బాబుగారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచ‌నాలను మరో లెవ‌ల్‌కి పెంచింది. టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడ‌లు విరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించారు.

డా. మోహ‌న్‌బాబు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు,
స్క్రీన్‌ప్లే: డా.మోహ‌న్‌బాబు,
నిర్మాత‌: విష్ణుమంచు,
బ్యాన‌ర్స్‌: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,
సంగీతం: మాస్ట్రో ఇళ‌యరాజా,
సినిమాటోగ్ర‌ఫి: సర్వేష్ మురారి,
మాట‌లు: డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌,
స్టైలిస్ట్‌(మోహ‌న్‌బాబు): విరానిక మంచు,
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌,
ఆర్ట్‌: చిన్నా,
ఎడిట‌ర్‌: గౌతంరాజు,
పిఆర్ఓ: వ‌ంశీ – శేఖ‌ర్‌.

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -