Monday, March 23, 2026

SS Rajamouli: ‘ఆచార్య’ ఫ్లాప్‌కు రాజమౌళి కూడా కారణమే!

SS Rajamouli: చిరంజీవి, రామ్‌చరణ్ కలయికలో వచ్చిన ఆచార్య చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటి వరకు కొరటాల శివ కెరీర్‌లో ఇలాంటి నాసిరకమైక కథతో, టేకింగ్‌తో సినిమా రాలేదని అంటున్నారు అందరూ. ముఖ్యంగా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగాభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు కొరటాల. సినిమా కనీసం యావరేజిగా వుంటుందని భావించిన వారి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా డిసైడ్ అయ్యింది ఆచార్య. అయితే ఆచార్య రూపంలో రామ్‌చరణ్ కెరీర్‌లో ఓ ఫ్లాప్ రావడానికి దర్శకధీరుడు రాజమౌళి కూడ ఒక కారణం అంటున్నారు మెగాభిమానులు.

ఆర్‌ఆర్‌ఆర్ చేస్తున్నప్పుడు చరణ్‌ను ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయ్యేవరకు ఎటువంటి సినిమాలు చేయకూడదని షరతు విధించాడు రాజమౌళి. అయితే కొరటాల శివ, చిరంజీవి రిక్వెస్ట్ మేరకు రాజమౌళి చరణ్‌కు ఆచార్యలో సిద్ధ పాత్రను పోషించడానికి కొన్ని డేట్స్‌ను కేటాయించాడు. అదే ఒకవేళ ఆ సమయంలో రాజమౌళి ఒప్పుకోకపోయి వుంటే రామ్‌చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఆచార్య వంటి డిజాస్టర్ మిస్ అయ్యివుండేది అంటున్నారు మెగాభిమానులు.

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -