Friday, October 18, 2024

ఖైరతాబాద్ మహాగణేశుని సన్నిధిలో పురాణపండ ‘గణానాం త్వా’

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్లమందికి కటాక్షించే మహాగణపతిగా దేశదేశాల్లోనూ దశాబ్దాలుగా పేరుపొందిన ఖైరతాబాద్ గణేష్ మహా సంరంభంలో ఈ ఏడు చందాలు చెల్లించే, అతిధులుగా పాల్గొనే భక్తులకు రెండు అపురూప శోభాయమాన గ్రంధాలను అందించబోతున్నట్లు ఉత్సవకమిటీ చైర్మన్ , శాసన సభ్యులు దానం నాగేందర్ , ఉత్సవ కమిటి అధ్యక్షులు రాజ్ కుమార్ వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.

ప్రఖ్యాత వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో మహా తేజోవంతమైన సుమారు వందపేజీల పవిత్ర సొగసుల శ్రీ గణపతి భగవానుని పవిత్ర గ్రంధం కాగా , రెండవది పాన్ ఇండియా సినెమా దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఆత్మీయబంధువు , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో ‘ శోభాయమానంగా ఋషుల మంత్రం విద్యల మంత్రం గుచ్చమనేది స్పష్టం చేస్తున్నారు నిర్వాహకులు.

ఆధ్యాత్మిక రంగాన్ని ఒక యజ్ఞభావనల నిస్వార్ధపవిత్ర మహా ప్రపంచంగా ప్రతీక్షణాన్ని సమర్పించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత కార్యక్రమానికి ప్రధాన పవిత్ర సూత్రధారి కావడం గమనార్హం.

శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా మంత్రమయ జ్ఞాపికలుగా లభించే అరుదైన అక్షర సంపదలను సమర్పించడం అదృష్టంగా పేర్కొంటున్నారు దానం నాగేందర్.

మొదటి తేజో విలసిత గ్రంధం ‘ గణానాం త్వా ‘ అపురూప శోభల మంత్ర శబ్దాల కాంతి పుంజం కాగా, రెండవది పరమ ఋషులు పరి పరి విధాల పరితపించిన స్తోత్ర విద్యల ‘ శ్రీమాలిక ‘ .

గణేశ, ముద్గల పురాణాలలోని పవిత్ర స్తోత్రాలతోపాటు, వేదాన్తర్గతమైన శ్రీ మహాగణపత్యుపత్ , ఆదిశంకరాచార్యుల శ్రీ గణేశపంచరత్నం వంటి అనేక అరుదైన విశేషాంశాలతో పరమ శోభాయమానంగా , అత్యంత ఆకర్షణీయంగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత విలువల ‘ గణానాం త్వా ‘ గాణపత్య పవిత్ర గ్రంధం జంటనగరాలలో ఇప్పటికే అనేక ఆలయాలకు చేరి పవిత్రంగా సంచలనం సృష్టిస్తోంది.

ప్రకృతీ చైతన్య పవిత్ర స్వరూపమే మహాగణపతి మంగళ స్వరూపంగా గజవదనుని శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథతోపాటు అనేక అందమైన విఘ్నేశ్వరుని సౌందర్య చిత్రాలతో , అక్కడక్కడా కర్పూరపలుకుల్లాంటి వ్యాఖ్యాన సౌందర్యాల్ని పురాణపండ కలం పొంగించడంతో ఈ ‘ గణానాం త్వా ‘ గ్రంధానికి అనేక చోట్ల జేజేలు పలుకుతున్నారు.

సుమారు డెబ్భైకి పైగా ఎన్నో ధార్మిక , ఆధ్యాత్మిక అపురూప గ్రంథాల్ని రచించి సంకలనం చేసి వేలకొలది అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్ గత రెండున్నర దశాబ్దాలుగా ఏటా వినూత్న శోభలతో అందిస్తున్న వరసిద్ధి వినాయక చవితి పవిత్ర సంచికకు ఒక గుర్తింపు ఉంటోందని యాదాద్రి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ . కిషన్ రావు , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి రమణాచారి స్పష్టం చేయడం గమనార్హం.

ఏదేమైనా … ప్రతీ ఏటా పురాణపండ వెలువరించే గ్రంధాల్లో జంటనగరాల్లో అత్యధికులకు చేరే గణపతి తేజోమయ గ్రంధంగా జీన్స్ ఫెస్టివల్ స్పెషల్ బుక్ ‘ కు వేలకొలది భక్త జనులు , పాఠకులు పవిత్రంగా జేజేలు పలకడం గమనార్హం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x