Cinema

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ ‘ఆల్ఫా’. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ టైటిల్‌ పాత్రలో కనిపిస్తారు. ఆమెతో పాటు శార్వరి  సినిమాలో కీ రోల్‌ చేస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు శార్వరి. ఆల్పాలో ఆలియా, శార్వరి ఇద్దరూ సూపర్‌ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్ లో రూపొందుతోంది ఆల్పా. శివ్‌ రావెల్‌ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందంటున్నారు మేకర్స్.

ఆల్ఫా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి పక్కా హాలిడే ట్రీట్‌ అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి చేస్తున్నారు. బిగ్‌ స్క్రీన్‌ స్పెక్టకిల్‌ అనే పదానికి సిసలైన అర్థం ఎలా ఉంటుందో చూపించనుందీ సినిమా. స్టన్నింగ్‌ విజువల్స్, అడ్రినలిన్‌ పంపింగ్‌ సీక్వెన్సులు, ఇంటెన్స్ యాక్షన్స్, అన్‌ ఎక్స్ పెక్టెడ్‌ ట్విస్టులతో అద్భుతంగా రూపొందుతోంది ఆల్ఫా.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM