Cinema

‘గేమ్ చేంజర్’ లో అప్పన్న పాత్రను చూస్తే షాక్ అవుతారు: నటుడు శ్రీకాంత్

సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీకాంత్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

గేమ్ చేంజర్‌లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ ప్రోస్థటిక్ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది.

ప్రోస్థటిక్ మేకప్‌లో నటించడం ఎలా అనిపించింది?
నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్‌ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.

శంకర్ గారి వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్‌ను ఆయన నటించి చూపిస్తారు.

గేమ్ చేంజర్‌లో మీ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందా? పాజిటివ్‌గా ఉంటుందా?
నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. అవన్నీ చెప్పొద్దని అన్నారు. గెటప్ వేసిన వెంటనే ఆ కారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాకు చాలా ముఖ్యమైన కారెక్టర్. ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం.

ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి?
ఎస్  జే సూర్య, జయరాం, సముద్రఖని, రామ్ చరణ్ ఇలా అందరితోనూ సీన్లు ఉంటాయి. ఎస్ జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సరిపోదా శనివారం పాత్రను మించేలా ఉంటుంది.

గెటప్ చాలా కొత్తగా ఉంది కదా.. ఈ లుక్‌ను ఎలా ఫైనల్ చేశారు?
మా తండ్రి గారి గెటప్‌ను చూసే నాకు ఈ కారెక్టర్ లుక్‌ను ఫిక్స్ చేశారు. గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి షాక్ అయ్యారు. హేయ్ బేబీ (నవ్వుతూ) అని సరదాగా పిలిచాను. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అనుకున్నాను.

రామ్ చరణ్ మళ్లీ వర్క్ చేశారు? అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా గమనించారా?
గోవిందుడు అందరివాడేలే చిత్రం టైంలో రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. రామ్ చరణ్ నన్ను ఎప్పుడూ అన్నా అని ఆప్యాయంగానే పిలుస్తాడు.

డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నారు కదా.. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడుతుంటారా?
దేవర చిత్రంలోనూ డిఫరెంట్ పాత్రను పోషించా. అఖండ టైంలోనూ కాస్త భయపడ్డాను. ఆపరేషన్ దుర్యోధన చిత్రాన్ని రిసీవ్ చేసుకున్నారు. అప్పటి నుంచి నాకు కాస్త ధైర్యం ఏర్పడింది.

గేమ్ చేంజర్ చిత్రం ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.

గేమ్ చేంజర్ చిత్రానికి సీక్వెల్ వంటివి ఏదైనా ఉంటుందా?
కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి చాలా నచ్చింది. అందుకే  సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవు.

షూటింగ్ చాలా ఆలస్యంగా, నిదానంగా జరగడానికి కారణం ఏంటి?
అందరి డేట్లు సెట్ అవ్వడం వల్లే షూటింగ్ ఆలస్యం ఏర్పడింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్‌లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.

రాబోవు చిత్రాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.

రీ రిలీజ్‌ల గురించి, మీ కొడుకు చిత్రాల గురించి చెప్పండి?
ఖడ్గం రీ రిలీజ్‌ను థియేటర్లో చూశాను. కుర్రాళ్లంతా చాలా ఎంజాయ్ చేశారు. పెళ్లి సందడి చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని అనుకుంటున్నాను. నా కొడుకు రోషణ్ ప్రస్తుతం ఛాంపియన్ చిత్రాన్ని చేస్తున్నాడు. మేం ఇద్దరం కలిసి ఇప్పట్లో అయితే నటించం. చిన్నోడు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. చదువులు పూర్తయ్యాక సినిమాల్లో వస్తాడు.

Share
Published by
admin

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM