Cinema

అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ హిలేరియస్ టీజర్ లాంచ్

హీరో అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.

టైటిల్ గ్లింప్స్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇవ్వగా, మొదటి సింగిల్ ఓ మేడమ్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈరోజు మేకర్స్ సినిమా టీజర్‌ను లాంచ్  చేశారు. హీరో జాతకాన్ని ఒక జ్యోతిష్కుడు చెప్పడంతో ఫన్నీ నోట్‌తో ప్రారంభమవుతుంది. హీరో ఒక తేదీలోపు వివాహం చేసుకోవాలి, లేకపోతే అతను తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడని జ్యోతిష్కుడు చెప్తాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లే అతని సరిపోయే అమ్మాయి దొరకదు. అలాంటి సమయంలో అతను, ఫరియా అబ్దుల్లాను చూస్తాడు. ఆమె కూడా అతని కంపెనీని ఇష్టపడుతుంది. అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టగానే ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని సింపుల్ గా చెప్పేస్తుంది.

ప్లాట్‌లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది, పాన్ ఇండియా లాంటి సమస్య పెళ్లిని ఎంచుకున్న మల్లి అంకం దీనిని వినోదాత్మకంగా రూపొందించాడు. అల్లరి నరేష్ తన అల్లరితో మళ్ళీ అలరించారు. తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. నరేష్ గర్ల్ ఫ్రెండ్ గా ఫరియా అబ్దుల్లా కూల్ గా కనిపించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష మొదలైన హాస్యనటులు మరింత వినోదాన్ని పంచారు. సూర్య క్యాప్చర్ చేసిన విజువల్స్ బ్రైట్, కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి,  గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదాన్ని పెంచింది. చిలక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ డిజైన్ జానర్‌కి సరిగ్గా సరిపోతుంది. నవ్వించే ఈ టీజర్ నిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. అబ్బూరి రవి డైలాగ్స్‌ అందించారు.  ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ గురించి ఓ వివరణ ఇవ్వాలి. నాన్నగారి ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలాంటి సీక్వెల్ కాదు. నాన్నగారి సినిమాలో జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకునేవాడి కథ. ఇందులో సెటిల్ అయినా పెళ్లి కాని వాడి కథ. చాలా హిలేరియస్ గా సినిమాని చేశాం. వింటేజ్ నరేష్ రావాలని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ కామెడీ సినిమాలు చేయాలని కోరారు. చాలా ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనే ఉద్దేశంతో కథపై చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చేశాం. నా బలం కామెడీ. ఈసారి మరింత నవ్వించాలని ఈ సినిమా చేశాం. మంచి కంటెంట్ వున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఫారియా మంచి కామెడీ టైమింగ్ వున్న యాక్టర్.  ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, వైవా హర్ష, హరితేజ ఇలా ఇందులో పాత్రలన్నీ అలరిస్తాయి. జామీ లివర్ తొలిసారి తెలుగులో నటిస్తున్నారు. ఈ సినిమాతో తను చాలా మంచి పేరు వస్తుంది. దర్శకుడు మల్లి గారు చాలా క్లియర్ విజన్ తో సినిమా తీశారు. కొత్త నిర్మాత రాజీవ్ గారు చాలా ప్యాషన్ సినిమాని నిర్మించారు. ఇలాంటి పాషన్ వున్న నిర్మాతని ప్రోత్సహించాలి. రాజీవ్ భరత్ చాలా స్నేహభావంతో వుంటారు. చికలా ప్రొడక్షన్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా నిలబడాలి’ అని కోరారు

నిర్మాత  రాజీవ్ చిలక మాట్లాడుతూ.. ఈవీవీ గారి టైటిల్ ని వాడుతున్నాం. మా మీద పెద్ద భాద్యత వుంది. ఆ టైటిల్ ఇచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు. చిలకా ప్రొడక్షన్స్ తొలి చిత్రమిది.  నిర్మాత కావాలనే నా ఇరవై ఏళ్ళ కల. అది ఈ సినిమాతో తీరింది. మల్లి గారు చెప్పిన కథ చాలా నచ్చింది. అల్లరి నరేష్ గారి ఈ కథని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. నరేష్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన ప్రతిభ చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఆయనతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో మరిన్ని  సినిమాలు చేయాలని వుంది. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు.

దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. నరేష్ గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్ ఎలా అయితే నవ్వుకుంటూ చూశారో ఈ సినిమా కూడా అలానే వుంటుంది. ఫ్యామిలీతో కలసి అనందంగా నవ్వుకుంటూ చూడదగ్గ చిత్రమిది’ అన్నారు

అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా రాస్తున్నపుడు, చేస్తున్నపుడు ఒక కిక్ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. రాజీవ్, భరత్ చాలా మంచి సమన్వయంతో సినిమాని నిర్మించారు. మల్లి అంకం ఎప్పటినుంచో పరిచయం.ఈ సినిమాలో మాటలు రాసే అవకాశం ఇచ్చారు. నరేష్ గారితో ఇది నాలుగో సినిమా. చాలా భాద్యతగా ఈ సినిమా చేశారు. టీజర్ లానే సినిమా అంతా నవ్వుకుంటూ ఆనందంగా చూసే సినిమా అవుతుంది” అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

Share
Published by
Shankar

Recent Posts

‘సీతా పయనం’ని అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను: యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్…

February 12, 2026 at 10:28 PM

‘హే భగవాన్’ నాట్ ఏ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 12, 2026 at 10:07 PM

హుషారు పిట్టలు రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం: టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో…

February 12, 2026 at 9:59 PM

నిలవే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా…

February 12, 2026 at 9:54 PM

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్…

February 12, 2026 at 6:41 PM

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని…

January 15, 2026 at 10:33 AM