పచ్చి తాగుబోతు... పారిశ్రామిక వేత్తగా మారిన వైనం | anaganaga oka rowdy
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం బాగా నడుస్తుంది. అది కూడా కేవలం సెలబ్రిటీల మీద మాత్రమే సినిమాలు వస్తున్నాయి. అంతేకాక సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ.
ప్రస్తుతం హీరో సుమంత్‌తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు.. ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి.. ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయంగా నిలిచాడు అనేది కథ. మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…