Cinema

F3 Release Date: ‘ఎఫ్3’ రిలీజ్ డేట్ ఫిక్స్

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్న‌ర్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. వరుస విజయాలతో బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా పేరు పొందిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ‌న్ రైడ‌ర్‌‌కు రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. ఆగ‌స్ట్ 27న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వదలబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సంద‌ర్భంగా.. ‘‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల జల్లులో ముంచెత్తి ఎంత పెద్ద హిట్ సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ‘ఎఫ్2’ ప్రేక్షకులను ఎలా నవ్వించిందో.. దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ‘ఎఫ్3’ కథను సిద్ధం చేశాడు డైరెక్టర్ అనిల్. ప్రస్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్‌ల కాంబినేషన్‌లో మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయడానికి ఆగ‌స్ట్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో న‌వ్వుల రైడ్ క‌న్‌ఫ‌ర్మ్‌’’ అన్నారు చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్.

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఎఫ్2కు ఫ్రాంచైజీగా మోర్ ఫ‌న్‌తో ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌గారు.. నిర్మాత‌లు రాజుగారు, శిరీష్ గారు స‌పోర్ట్‌తో చ‌క‌చ‌కా సినిమాను పూర్తి చేస్తున్నాం. ఆగ‌స్ట్ 27న మ‌రోసారి న‌వ్వుల్లో ముంచెత్త‌డానికి మీ ముందుకు వ‌స్తున్నాం’’ అన్నారు.

న‌టీన‌టులు:
వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
నిర్మాత‌: శిరీష్‌
స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరామ్‌
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
ర‌చ‌నా స‌హ‌కారం: ఎస్‌.కృష్ణ‌
ఆడిష‌న్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయ‌ణ‌, నారా ప్ర‌వీణ్‌

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM