Cinema

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ   కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్  చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ… ”సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..” అని తెలిపారు.

అప్సరరాణి మాట్లాడుతూ… ”మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు..” అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ… తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వ‌చ్చాయి. అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అంద‌రికి న‌చ్చుతుంది..” అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ… ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌త‌తో, అంకిత‌భావంతో ప‌ని చేసే వ్య‌క్తి. ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది..” అని తెలిపారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్ చెప్పారు. ఎంతో ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్న చిత్ర‌యూనిట్ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM