Cinema

‘బేబీ’ ఆహాలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

ఆగ‌స్ట్ 18, హైద‌రాబాద్‌: తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకెళ్తోన్నఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను అందించిన ఆహా తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బేబి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు పొందిన ‘బేబి’ చిత్రం త్వ‌ర‌లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది. ఈ నేప‌థ్యంలో రూ.899లను చెల్లించిన త‌న గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు మ‌రో అపూర్వ అవ‌కాశాన్ని అందించింది ఆహా. ఈ గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంట‌లు ముందుగానే బేబి సినిమాను చూడ‌బోతున్నారు. ఈ గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ తీసుకున్న వారు సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను చూసేట‌ప్పుడు 4K డాల్బీ ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు. ఈ స‌దుపాయం ఇటు తెలుగు, అటు త‌మిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోని స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అందుబాటులో ఉంది. ఆహా స‌బ్ స్క్రిప్ష‌న్‌లో చాలా మార్పులను చేసింది. దీని కార‌ణంగా ఎస్‌వీఓడీ (స‌బ్ స్క్రిప్ష‌న్ వీడియో ఆన్ డిమాండ్‌)లో చాలా గొప్పగా నెంబ‌ర్స్ న‌మోదు అయ్యాయి. ఆహా తెలుగు ఆడియెన్స్ కోసం స‌బ్ స్క్రిప్ష‌న్ వివ‌రాలు

* రూ. 699ల‌కు ఏడాది పాటు ఎలాంటి యాడ్స్ లేని ప్యాక్ ల‌భ్యం
* రూ. 399ల‌కు ఏడాది పాటు యాడ్స్‌తో కూడిన ప్యాక్ ల‌భ్యం
* రూ. 199ల‌కు మూడు నెలల పాటు యాడ్స్‌తోకూడిన‌ ప్యాక్ ల‌భ్యం
* రూ.99 ల ప్యాకేజీ యాడ్స్‌కూడింది. ఇది కేవ‌లం మొబైల్ యూజ‌ర్స్‌కు మాత్ర‌మే.

ఈ సంద‌ర్భంగా ఆహా వైస్ ప్రెసిడెంట్‌, బిజినెస్ స్ట్రాట‌జీ, ఎస్‌వీఓడీ హెడ్ రాకేష్ సీకే మాట్లాడుతూ… ‘‘ప్రేక్షకులకు అత్యంత నాణ్యతతో కూడిన నిరంతర వినోదాన్ని అందించాలనే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వారికి మరింత స్థిరమైన వినోదాన్ని మరిన్ని ఫీచర్స్ కలిపి అందించాలనే ఉద్దేశంతో సబ్ స్క్రిప్షన్ ప్యాక్ ధరలలో కొన్ని మార్పులు చేయటం జరిగింది”.

సామజవరగమన, హిడింబ వంటి సినిమాలతో ఆహా తన యూజర్లను అలరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లెటెస్ట్ సెన్సేషనల్ కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి సినిమా ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమాను ఎస్ కే ఎన్ (శ్రీనివాస్ కుమార్ నాయుడు) నిర్మించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

ఆహా వేదిక మీద బేబి చిత్రం ప్రదర్శితం కానుంది. థియేటర్లో ఆల్రెడీ ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉంది. ఆహా ఫ్లాట్ ఫాంపై బేబి సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఆహాలోని కంటెంట్ ప్రతీ ఏజ్ గ్రూప్ ఆడియెన్స్, క్లాస్ మాస్ ప్రేక్షకులన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తూ ఉంటుంది.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM