Cinema

‘భరతనాట్యం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సూర్య తేజ జీవితంలో అనేక సమస్యలతో వున్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ రాజు సుందరంగా పరిచయం కావడంతో ట్రైలర్ మొదలౌతుంది. హర్షవర్ధన్ గ్యాంగ్‌స్టర్‌గా ఎంట్రీ తర్వాత, వైవా హర్ష సినిమా హీరోగా పరిచయం అయ్యాడు. తప్పని పరిస్థితుల్లో, హీరో రాంగ్ పాత్ ని ఎంచుకుంటాడు. దీంతో రాత్రికి రాత్రే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవుతాడు.
సూర్య తేజ తన మొదటి సినిమాలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. అమాయకంగా కనిపించినప్పటికీ, అతను తెలివిగలవాడు. సూర్యకు జోడిగా మీనాక్షి గోస్వామి కనిపించింది. సినిమా హీరోగా వైవా హర్ష ట్రాక్ మెయిన్ హైలైట్‌లలో ఒకటి. హర్షవర్ధన్ నెగిటివ్ రోల్ పోషించగా, అజయ్ ఘోష్ పోలీసుగా కనిపించాడు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క ఫన్,  క్రైమ్ అంశాలను ఎలివేట్ చేసింది, వెంకట్ ఆర్ శాకమూరి కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్. ప్రొడక్షన్ వాల్యూస్  బాగున్నాయి. మరో రెండు వారాల్లో రాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్ మంచి అంచనాలను నెలకొల్పింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ.. సూర్య కి బెస్ట్ డెబ్యు దొరికింది. దానికి కారణం సూర్యకి బెస్ట్ డాడ్ ధని వున్నారు. దాని వలనే బెస్ట్ కంటెంట్, బెస్ట్ సపోర్ట్ దొరికింది. భరతనాట్యం క్రైమ్ కామెడీ. ఇది సక్సెస్ ఫుల్ జానర్. ఇంత మంచి ఎంటర్ టైనర్ ద్వారా తను పరిచయం కావడం ఆనందంగా వుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ లో హిట్ కళ కనిపిస్తోంది. నిర్మాత పాయల్ గారిలో ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదు. దీనికి కారణం కంటెంట్ ఇచ్చిన భరోసా. దర్శకుడు మహేంద్ర కి కూడా ఇది మైల్ స్టోన్ సినిమా కావాలి. ధని సినిమా పరిశ్రమనే నమ్ముకొని వున్నారు. తను గ్రేట్ పెయింటర్. ఇప్పుడు తన కొడుకుని కూడా నటుడిగా పరిచయం చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా తప్పకుండా అందరికీ మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. కంటెంట్ నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.  దర్శకుడు  కేవీఆర్ మహేంద్ర గారు చాలా అద్భుతమైన చిత్రాన్ని అందించారు. ట్రైలర్ లాంచ్ చేసిన కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. హర్ష వర్ధన్ గారికి, వైవాహర్షకి, కృష్ణుడు గారు, సలీం.. వీరి పాత్రన్నీ అలరిస్తాయి. మీనాక్షి గోస్వామి చక్కగా నటించారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ట్రైలర్ లో వుండే ఎనర్జీ థియేటర్స్ లో వుంటుంది. ఏప్రిల్ 5న సినిమా వస్తోంది. పుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ ఇది. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ.. దొరసాని చిత్రానికి భిన్నంగా చేసే అవకాశం ఈ సినిమాతో దొరికింది. దాన్ని ఒక సవాల్ గా తీసుకొని ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇందులో చాలా మంచి డ్రామా వుంటుంది. కంటెంట్ బావుంటే సినిమాలు పాన్ ఇండియా వెళ్తున్నాయి. ఈ సినిమాకి ఆ బలం వుందని భావిస్తున్నాను. కథలో చాలా బలం వుంది. ఇందులో వుండే పాత్రలన్నీ కొత్తగా వుంటాయి. సూర్య పాత్రలో లీనమై చేశాడు. ఇందులో కొత్త హర్షవర్ధన్ గారిని చూస్తారు. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. నలఫై నిమిషాల పాటు కడుపుబ్బానవ్వించే సీక్వెన్స్ లు వుంటాయి. నిర్మతాలు చాలా సపోర్ట్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. మీ అందరి సహకరం కావాలి’ అని కోరారు

హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ.. అద్భుతమైన సినిమా ఇది. కామెడీ, థ్రిల్ , డ్యాన్స్. ఫ్యామిలీ, లవ్ డ్రామా  అన్ని ఎలిమెంట్స్ వున్నాయి . తప్పకుండా అందరూ వెళ్లి థియేటర్స్ సినిమా చూడాలి’’ అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Recent Posts

“అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన "అమరావతికి ఆహ్వానం" సినిమా ఫిబ్ర‌వ‌రి 13న‌…

February 13, 2026 at 9:41 PM

హే భగవాన్‌ నిర్మాత బి.నరేంద్ర రెడ్డి ఇంటర్వ్యూ

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం…

February 13, 2026 at 9:33 PM

24 గంటల్లోనే.. ఓటీటీలోనూ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో…

February 13, 2026 at 9:11 PM

మెగా ట్విన్స్ పేర్లపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపయ్యింది. వారి…

February 13, 2026 at 9:05 PM

“మార్కండేయ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు.…

February 13, 2026 at 8:54 PM

నాని ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్

నేచురల్ స్టార్ నాని మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV…

February 13, 2026 at 8:39 PM