Cinema

బిగ్‌ బాస్‌ 4 విన్నర్‌కి నాగ్‌ బంపర్‌ ఆఫర్‌

మాటీవీలో ప్రసారమయిన బిగ్ బాస్ పోగ్రామ్ ఇప్పటికి 4 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 4 కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ పోగ్రాంలో గ్రాండ్ ఫినాలేలో విన్నర్ గా నిలిచి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రైజ్ మనీని అందుకున్న వ్యక్తి అభిజిత్. అయితే బిగ్ బాస్ 4 విన్నర్ కి ఆ షో హోస్ట్ అయిన నాగ్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిజిత్ కి కింగ్ నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడని, ఇప్పటి వరకు ఎవరికీ నాగార్జున అటువంటి ఆఫర్ ఇవ్వడం అనేది జరగలేదని అంటున్నారు. అదేమిటంటే… అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా రాబోయే ఒక 3 సినిమాలలో నటించేందుకు అభిజిత్ తో అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా కంటెస్టెంట్స్ లో సోహెల్, మెహబూబ్ లను టివి షోస్ ద్వారా పరిచయం చేయనున్నారట.

ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా అభిజిత్ తో నాగ్ నిర్మించే మొదటి చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో రాబోయే మరో రెండు చిత్రాల వివరాలు గురించి తెలియాల్సి ఉంది. ఇంతలో అభిజీత్ కొన్ని వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఇదిలా ఉంటే నాగార్జున నటించిన చిత్రం వైల్డ్ డాగ్ చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM