excellent Bheeshma Ekadasi treat from balayya
భీష్ముడు మహాభారతంలో ప్రముఖుడు. కురుక్షేత్రం తరువాత అంపశయ్యపై దాదాపు నెలన్నర రోజులు జీవించి ఉండి మాఘ శుక్ల ఏకాదశి రోజున పరమపదించారు. అందుకే ఆ రోజుకి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. అందరు ఆయన్ని భీష్మ పితామహుడు అని పిలుస్తుండేవారు. ఈయనికి ఎన్నో ధర్మ సూత్రాలు తెలుసు. మరణ శయ్యపై ఉండి వాటిని ఎప్పుడు వీడలేదు. అందుకే ఇప్పటికి ఆయన పరమపదించిన రోజుని కొన్ని ప్రాంతాల్లో ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు.
నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..
“భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.” అన్నారు.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…