Cinema

‘పక్కా కమర్షియల్‌’గా మారిపోతున్న మారుతి, గోపీచంద్

pakka commercial: డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో వచ్చిన‘ప్ర‌తిరోజు పండ‌గే’ ఎటువంటి సక్సెస్‌ను అందుకుందో తెలిసిందే. మరి ఈ చిత్ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత ద‌ర్శ‌కుడు మారుతి చేయ‌బోయే సినిమాపై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. లాక్‌డౌన్‌లో కూడా మారుతి తదుపరి చిత్రం గురించి కొన్ని వార్తలు రావడం, వాటిని మారుతి ఖండించడం వంటివి జరుగుతూ వచ్చాయి. ఇక మారుతి తదుపరి సినిమాపై ఉన్న ఉత్కంఠ‌కి తెరదించుతూ ఇటీవ‌లే మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ ముందుకు సాగుతున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌నల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు.

ఈ చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచ‌ర్లు వాడుతూ వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అనే టైటిల్‌ని ప్ర‌క‌టించి, టైటిల్ లుక్‌ని ప్రేమికులరోజు కానుకగా విడుద‌ల చేశారు. ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ ద్వారానే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జి ఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ లో భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతిరోజు పండుగే చిత్రాలతో హ్యాట్రిక్‌ రాగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం అన్నట్లుగా గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది.

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి
స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ – బ‌న్నీవాసు
ఆర్ట్ – ర‌వీంద్ర‌
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్
సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల
ఎడిటింగ్ – ఎస్‌పి ఉద్భవ్
స‌హ నిర్మాత – ఎస్ కే ఎన్
ద‌ర్శ‌కుడు – మారుతి

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM