Cinema

Nithiin Check: నితిన్‌ ‘చెక్’కి ఫిబ్రవరి సెంటిమెంట్ కలిసొస్తుందా?

యూత్ స్టార్ నితిన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రకటించారు. ‘‘జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది. ఇందులో కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. చిత్రాన్ని ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము..’’ అని నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు.

ఇక ‘చెక్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించగానే.. నితిన్‌కి బాగా కలిసొచ్చిన ఫిబ్రవరి గుర్తు చేసుకుంటూ.. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో విడుదలైన నితిన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. నితిన్ కెరియర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన ‘ఇష్క్’, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’ చిత్రాలు ఎటువంటి విజయాలు సాధించాయో తెలియంది కాదు. పైగా ఈ రెండు సినిమా టైటిల్స్ కూడా రెండక్షరాలతోనే ఉండటంతో.. ఇప్పుడు విడుదల కాబోతోన్న ‘చెక్’ కూడా రెండక్షరాలే కావడంతో.. సెంటిమెంట్ వర్కవుటయ్యి.. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 19 వరకు వెయిట్ చేయక తప్పదు.

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్: వివేక్అన్నామలై, ఎడిటింగ్: అనల్ అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, నిర్మాత: వి.ఆనంద ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM