Cinema

మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో నందమూరి హీరో చిత్రం ప్రారంభం

Nandamuri Hero movie: టాలీవుడ్‌లో టాప్‌ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్‌.. తమ బ్యానర్‌లో మరో చిత్రాన్ని ప్రారంభించుకుంది. ఇప్పటికే ‘ఉప్పెన’ వంటి సక్సెస్‌ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేస్తున్న ఈ బ్యానర్‌ ఇప్పుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌తో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని ప్లాన్‌ చేసింది. ఒక్క కల్యాణ్‌ రామే కాదు.. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహ బాలయ్య, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. వంటి హీరోలతో కూడా తమ చిత్రాలు వరుసగా ఉండబోతున్నాయని ఇటీవల నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో ముందు వరుసలో ఉన్న హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.14 గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. ద‌ర్శ‌కులు భ‌ర‌త్ క‌మ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో క‌ల్యాణ్ రామ్‌, నిర్మాత న‌వీన్ ఎర్నేని, సీఈఓ చెర్రీ .. చిత్ర ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌కు స్క్రిప్ట్‌ను అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేయనున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో నందమూరి హీరో చిత్రం ప్రారంభం | Nandamuri Hero movie

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎర్నేని అనిల్‌,
సీఈఓ: చెర్రీ,
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌,
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాజేంద్ర‌.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM