మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదరగొడుతోంది. ZEE5లో ప్రీమియర్ తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది
డిజిటల్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే, MSG 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది, ఇది ప్లాట్‌ఫామ్‌లో ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన నెంబర్ సినిమాపై ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. బాక్సాఫీస్‌ను ఏలిన సినిమాలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అరుదుగా మాత్రమే బిగ్ నెంబర్స్ సాధిస్తాయి, ఇప్పుడు MSG అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది.
ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రధాన పాత్ర పోషించాయి. ఆయన కరిజ్మా ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది. అనిల్ రావిపూడి కలర్‌ఫుల్ కామెడీ, హార్ట్‌ఫెల్ట్ డ్రామాతో రూపొందిన MSG థియేటర్లలతో పాటు ఓటీటీలో కూడా సమానంగా అలరిస్తోంది.
షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించారు.




