Cinema

నీదారే నీ కథ మూవీ టీజర్ లాంచ్ ఘనంగా జరిగింది

జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా నీ దారే నీ కథ టీజర్ లాంచ్ ఈవెంట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారు చేతుల మీదుగా చాలా ఘనంగా జరిగింది. మొత్తం కొత్త టీం తో ఈ ఈవెంట్ ని ఇన్నోవేటివ్ గా కొత్తగా చేశారు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో మొత్తం కొత్త వాళ్ళతో ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.

నిర్మాత తేజేష్ మాట్లాడుతూ : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీ మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు మొదటి సినిమా అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నా ప్రింట్ మరియు టెలివిజన్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి మరియు క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ గారికి మరియు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

నిర్మాత శైలజ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : సినిమా మీద ఉన్న  ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించాం. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. బుడాపెస్ట్ లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి అలెగ్జాండర్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా గతంలో మిషన్ ఇంపాజిబుల్, పరసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించిన మ్యూజిషియన్స్ తో చాలా గ్రాండ్ గా చేసాం. మీడియా మరియు ప్రేక్షకులు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమాను మన సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత మరియు దర్శకుడు వంశీ జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ : నేను న్యూయార్క్ లో డైరెక్షన్ గురించి చదువుకొని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని మన నేటివిటీకి తగినట్టుగా తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఎంతోమంది సింక్ సౌండ్ రిస్క్ అంటున్న సింక్ సౌండ్ తోనే ఎగ్జిక్యూట్ చేసి హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గకుండా చేయడమైనది. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మ్యూజిక్ డిజైన్ చేయించాం. మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది అన్నారు.

నటీనటులు :
ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.

Share
Published by
Shankar

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM