Cinema

గోవాలో ఎన్టీఆర్ ‘దేవర’ పార్ట్ 1 చిత్రీకరణ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ సినిమా చిత్రీకరణను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వస్తోన్న అప్‌డేట్స్‌తో రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.

దేవర మేకర్స్ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్‌  విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ‘దేవర’ పార్ట్ 1 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా ఇండియా రేంజ్‌లో అది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఎక్కువమంది చూసిన గ్లింప్స్‌గా అది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాక్కో, నరైన్ తదితరులు

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM