Prabhas in Salaar
యంగ్ రెబల్ స్టార్ అలియాస్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ‘సలార్’. సౌత్ ఇండియా సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హోంబలే ఫిలింస్ (కె.జి.యఫ్ నిర్మాణ సంస్థ) అధినేత విజయ్ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2022 అంటే వచ్చే సంవత్సరం, ఏప్రిల్ 14న సలార్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌తో సినిమా అంటే ఆయన అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అంచనాలను మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్ 14న మీ అందరితో కలిసి సలార్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…