Cinema

యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది.

ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని వేదాల శ్రీనివాస్ గారు తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ… తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ గారు ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే   దూకుడు ని   ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.

ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM