‘రాధేశ్యామ్’ గ్లింప్స్ విడుదల వివరాలివే | Radhe Shyam glimpse release details
Radhe Shyam glimpse release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 ఉదయం 9.18 నిమిషాలకు రాధే శ్యామ్ గ్లింప్స్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇందులో రొమాంటిక్‌గా నడుచుకుంటూ వెళుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. టీజర్ కూడా పూర్తిగా రొమాంటిక్‌గానే ఉండబోతుందని తెలుస్తోంది. రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…