Cinema

ఫిబ్రవరి 14న ప్రేమికులకు ప్రభాస్‌ ట్రీట్‌

పాన్‌ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మోషన్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14న రాధే శ్యామ్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.

ప్రభాస్, పూజా హెగ్డే, ప్రియదర్శి తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
పిఆర్‌ఓ : ఏలూరు శ్రీను

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM