Cinema

రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న మూవీ ‘ఛార్లి 777’

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది.

ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బందులు ప‌డిన‌ప్పుడు ధ‌ర్మ అనే వ్య‌క్తిని ఎలా క‌లుసుకుంది. వారి మ‌ధ్య అనుబంధం ఎలా ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను 777 ఛార్లి అనే అడ్వెంచర‌స్ కామెడీలో చూపించ‌బోతున్నారు. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు.

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే మలయాళంలో నటుడు, నిర్మాత పృథ్వీ రాజ్ సుకుమారన్, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించనున్నారు.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM