Cinema

Rana Virata Parvam: ‘విరాట‌ప‌ర్వం’ విడుదల ఎప్పుడంటే..

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇవ‌న్నీ ‘విరాట‌ప‌ర్వం’పై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిప‌ల్ల‌వి జోడీ చూడ‌చ‌క్క‌గా ఉంద‌ని అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు. రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ.. తాజాగా రానా, సాయిపల్లవిల పోస్టర్స్‌ను విడివిడిగా విడుదల చేశారు. ఇవి ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ బాబు
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎస్.ఎల్‌.వి. సినిమాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర‌
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, ప్రేమ్ ర‌క్షిత్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM