Cinema

ఎస్.ఆర్. కల్యాణమండపం టీజర్ వదిలారు

కిరణ్ అబ్బవరం హీరోగా దూసుకుపోతున్నారు. వరుస చిత్రాలతో యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నారు. ఆయన హీరోగా, ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్‌గా శ్రీధర్ గాదే దర్శకత్వంలో.. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ చిత్రం ‘ఎస్.ఆర్. కల్యాణమండపం’. శ్రీధర్ గాదె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో సింహ కోడూరి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తన ప్రయత్నానికి మనం అందరూ సపోర్ట్ చేయాలి. మనం ఈ సినిమాను థియేటర్స్‌లో చూస్తే ఇలాంటి ట్యాలెంటెడ్ నటులు బయటికి వస్తారు. ఒక మంచి కథతో ఎస్.ఆర్.కల్యాణ మండపం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సినిమాను విష్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అందరికి మంచి హాస్పటాలిటీ కల్పించి ఈ ఎలైట్ బ్యానర్ సినిమాను కంప్లీట్ చేశారు. వీరు ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘మా మొదటి ప్రయత్నం రాజావారు రాణిగారు సక్సెస్ చేశారు. మా రెండో సినిమా ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా టీజర్ బాగుందని అందరూ అంటున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో సాయికుమార్ గారి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్ట్, కెమెరా, మ్యూజిక్ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ వారు బాగా సపోర్ట్ చేశారు. కరోనా సమయంలో కూడా అందరూ టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. షాట్ ఫిలింస్ చేసి నేను ఈ స్థాయికి వచ్చాను. నాలాంటి కొత్తవారికి ఇలాంటి సహకారం అందించడం నిజంగా మర్చిపోలేను. నేను వీలైనంత మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరిని అలరించబోతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

హీరో సింహ కోడూరి మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎనర్జీతో కంప్లీట్ చేశారు. అదే ఎనర్జీ మీరు కంటిన్యూ చేయాలి. కిరణ్ అబ్బవరంగారు మీరు చాలా మందికి స్ఫూర్తి. కొత్తగా వచ్చే నటులు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఎలైట్ బ్యానర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. ఈ మూవీ హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటూ.. యూనిట్ మెంబర్స్ అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను..’’ అన్నారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM