Cinema

శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-15 ప్రారంభం

2016లో నానితో ‘జెంటిల్ మన్’ – 2018లో సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’- ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో  ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్  నెంబర్. 15 గా రూపొందుతోన్న  ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా  కార్యక్రమాలతో ఆరంభమైంది  . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్  మాట్లాడుతూ… “మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభా  శాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో జెంటిల్ మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. ‘బలగం’ తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో  కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం. స్వీట్ ఎంటర్టైనర్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాల గారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ  సినిమా . ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది” అని తెలిపారు.

ప్రియదర్శి, రూప కొడవాయూర్, వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవ’ హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె.  మణి, ఇందులో ప్రధాన తారాగణం.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM