Cinema

రజినీకాంత్ ‘తలైవా 171’కు టైటిల్ పెట్టేశారు

సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘కూలీ’ అనే టైటిల్ పెట్టారు. ఇది రజినీకాంత్ యొక్క 171వ చిత్రం. ఈ సినిమాకి గతంలో ‘తంగం, రాణా’ అని పేర్లు వినిపించాయి. ఇప్పుడు ‘కూలీ’ అని టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ లుక్‌ను కూడా వదిలారు. ఈ టైటిల్‌ను పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో రజినీకాంత్ యాక్షన్, ఇంకా డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ హల్చల్ చేస్తోంది.

‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్.. రజినీకాంత్‌తో చిత్రాన్ని ప్రకటించడంతో కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తులు. ఈ టీజర్‌ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్‌లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ ముఠా బాస్‌కి ఫోన్‌‌లో వార్నింగ్ ఇస్తాడు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM