Cinema

మరో హీరోయిన్‌కి తంబీలు.. గుడి కట్టేశారు

Nidhhi Agerwal Temple: హీరోయిన్లు అంటే అభిమానం ఉండడం అనేది సహజం. అభిమానం ఉంటే ఆమె పుట్టిన రోజున కేక్ కట్ చేసి, పార్టీలు చేసుకోవడం అనేది కూడా సర్వ సాధారణం. కానీ వీరి అభిమానం మాత్రం కట్టలు తెంచుకుంది అంటే అతిశయోక్తి కాదు. అసలు విషయంలోకి వెళితే హీరోయిన్ మీద అభిమానంతో ఏకంగా ఒక విగ్రహం చేయించి గుడి కట్టేశారు అభిమానులు. ఆమె విగ్రహానికి పాలాభిషేకాలు, ఆ విగ్రహం ముందు కేక్ కటింగ్ చేయడం, ఆమెకి ధూప, దీప, నైవేద్యాలు, హారతి కూడా సమర్పించుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారు కదా.. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్, మిస్టర్‌ మజ్ను సినిమాలలో నటించిన నిధి అగర్వాల్. తనకి గుడి కట్టారని తెలిసిన ఆ భామకి.. షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందట.

తమిళ తంబీలకు నచ్చిన వారికి గుడి కట్టడం తమిళనాడులో సాధారణ విషయమే. ఇంతకుముందు ఖుష్బూ, నమిత, హన్సికలకు కూడా వారు ఇలాగే గుడి కట్టి ఆరాధించారు. ఇప్పుడు వారి లిస్ట్‌లోకి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ కూడా చేరింది. కనీసం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోక ముందే ఇలా అభిమానులు గుడి కట్టడం చూస్తుంటే.. ఎలా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదంటుంది నిధి. ఇదంతా కూడా చెన్నైలో జరిగింది. ఈ భామ తమిళంలో నటించింది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ అభిమానులు ఇలా గుడి కట్టడం అనేది చెప్పుకోవాల్సిన విషయమే మరి.

మాములుగా అయితే తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం. అందుకే ఇప్పటి వరకు వారు గుడి కట్టిన లిస్ట్‌లో బొద్దుగుమ్మలే ఉన్నారు. తొలిసారి వారు బక్కబలిచిన భామకు గుడి కట్టడం విశేషం. సన్నగా ఉంటేనేమీ.. నిధిలో అందాల నిధి ఏమైనా తక్కువ ఉందా? ఆ నిధికే పడిపోయారు తంబీలు. ఈ వార్తతో ఇప్పుడు నిధి అగర్వాల్‌ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM