Cinema

వైభవంగా ‘తలకోన’ ప్రి రిలీజ్ వేడుక

అక్షర క్రియేషన్ పతాకంపై  నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . ఈ చిత్రం అన్ని  హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రి రిలీజ్ వేడుక నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్, Ds రావు, ప్రముఖ హీరో రమాకాంత్  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పార్ధు రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ  సందర్భంగా చిత్ర  నిర్మాత శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ.. మా  హీరోయిన్  అప్సర రాణీ ఇప్పటివరకు చేయని వెరైటీ సబెక్ట్ ఇది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా వుంటుందని చూపించాం.అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది.  అలాగే థ్రిల్లింగ్  సస్పెన్స్ తో మార్చి  29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు .

దర్శకుడు నగేష్ నారదాసి  మాట్లాడుతూ.. అప్సర రాణీ నీ  చూస్తే కాశ్మీర్ యాపిల్ ల కనిపిస్తుంది.కానీ ఈ సినిమాలో  తను  కాశ్మీర్ మిర్చి లా నటించింది . చాలా వెరైటీ స్టోరీ ఇది .షూటింగ్ “తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మా  లాంటి చిన్న సినిమాలకు  సరైన షోస్ ఇచ్చి సినిమాలను బ్రతికించాలని ఈ సందర్భంగా  నేను కోరుకుంటున్నాను ” అని అన్నారు
హీరోయిన్ అప్సర రాణీ మాట్లాడుతూ”నా కెరీర్ లో ఈ చిత్రం డెఫినెట్ గా ఓ మైలు రాయి గా నిలుస్తుంది. నేనింతవరకు చేయని ఫైట్స్ ఈ చిత్రంలో చేయడం జరిగింది. మాస్ & క్లాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్,  రంగ రాజన్, రాజా రాయ్  యోగి కత్రి తదితరులు.

Share
Published by
Shankar

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM