Cinema

‘పుష్ప’.. విలన్‌గా చేస్తుంది ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలవైకుఠ‌పురంలో లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థ‌లం‌ లాంటి ఇండ‌స్ట్రిహిట్ త‌రువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌రువాత హ్యాట్రిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ గా టాలీవుడ్ లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తం శెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ‌టం విశేషం. టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, షూటింగ్ అప్‌డేట్ లు కి వ‌చ్చిన క్రేజ్ వ‌రల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

ఆగ‌స్ట్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పుష్పరాజును ఢికొట్టే ధీటైన విల‌న్ ఎవ‌ర‌నే ఉత్కంఠ అంత‌టా నెల‌కొంది, ఆ ఊహాగానాల‌కు తెర‌దించుతూ పుష్ప‌లో న‌టించ‌నున్న విల‌న్ ఎవ‌ర‌నే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు మైత్రీ మూవీ మేకర్స్. జాతియ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ కూడా సినీ అభిమానుల ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. ఫ‌హాద్ ఫాజిల్ లేటెస్ట్ మూవీ ట్రాన్స్, సీ యూ సూన్ వంటి సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాయి. ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ కి జోడిగా ర‌ష్మిక న‌టింస్తుంది. ర‌ష్మిక లుక్ కూడా చాలా నేచుర‌ల్ గా వుంటుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆడియో హైలెట్ గా నిలుస్తుంది. అల్లు అర్జున్‌, సుకుమార్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో ఆడియో కి ఒక క్రేజ్ వుంటుంది.

అలాగే మైత్రిమూవీస్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్ లో వ‌చ్చే ఆడియోకి ఓ క్రేజ్ వుంటుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ పుష్ఫ ఆడియోకి క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హింది భాష‌ల్లో ఏక‌కాలంలో అగ‌ష్టు 13న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని తరహా ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నారు.

నటీనటులు :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)
రష్మిక మందన్న (హీరోయిన్)

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టైలింగ్ : దీపాలి నూర్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను – మ‌డూరి మధు

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM