Cinema

కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కొత్త సినిమా ప్రారంభం

క్రిస్పి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రొడ‌క్ష‌న్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది.

యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా నిర్మాణంలో నా వంతు బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.

లిరిక్ రైటర్ కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ… సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉంటుంది.

చిత్ర నిర్మాత పోతురాజు నర్సింహారావు మాట్లాడుతూ… మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. అందరి సహకారం ఉండాలి. కొత్త తరం నటులను ఆశీర్వదించండి.

డైరెక్టర్ ఊర శ్రీనివాస్ మాట్లాడుతూ… మా సస్పెన్స్ triller అందరిని ఆకట్టుకుంటుంది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ అవుతుందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ ఆత్రేయ మాట్లాడుతూ… పాటలు బాగా వచ్చాయి. నాలుగు పాటలు ఉన్నాయి. మ్యూజికల్ హిట్ కూడా అవుతుందని నమ్మకం ఉంది. సినిమాను సూపర్ హిట్ చేయాలి.

హీరోలు యస్వంత్, సాయితేజమాట్లాడుతూ… మా తొలి సినిమను ఆదరించాలి.

హీరోయిన్లు ఆరుషి, నిఖిల మాట్లాడుతూ… అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. యూత్ కు నచ్చే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాం.

మాటల రచయిత దాసరి వెంకట్ మాట్లాడుతూ… ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోకు ధన్యవాదాలు. ఊపిరి బిగబట్టుకుని చూసే సస్పెన్స్ క్రిస్పీ థ్రిల్లర్ ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.

కథ రచయిత సుస్మా ప్రియదర్శిని మాట్లాడుతూ… థ్రిల్లర్ అండ్ కామెడీ మిక్స్ చేసి తీస్తున్న సినిమా ఇది. అందరిని ఆకట్టుకుని హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM