ప్రశాంత్ కిషోర్‌కు కీలక బాధ్యతలు.. సీఎం సంచలన నిర్ణయం!
కొంతకాలంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా ప్రముఖంగా వినపడే పేరు ప్రశాంత్ కిషోర్. ఈ రాజకీయ వ్యూహకర్త ఆలోచనలతోనే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయనడం అతిశయోక్తి కాదు. దేశ రాజకీయాల్లో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రశాంత్ కిషోర్.. ఈసారి మరో కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారుగా ఆయన్నే నియమించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ అమరీందర్ సింగే ఒక ట్వీట్‌లో బయట పెట్టారు. పంజాబ్ ప్రజల జీవితాలను మరింత మెరుగు పరిచడం కోసం తామిద్దరం కలిసి పనిచేస్తామని, దీని కోసం ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నామని కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
పంజాబ్‌లో 2017లో ఎన్నికలు జరిగాయి. దేశంలో చాలా చోట్ల బీజేపీ హవా నడుస్తున్నా కూడా.. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా కీలక భూమిక పోషించాయి. అమరీందర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు ఎంతో కీలకం అవబోతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, బీజేపీతో శిరోమణి అకాలీదళ్ తెగతెంపులు చేసుకోవడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మరోసారి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో బీజేపీని పూర్తిగా వెనక్కు నెట్టేయాలని కెప్టెన్ అమరీందర్ ప్లాన్ అని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బెంగాల్ పుత్రిక మమతకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, విజయం తమదేనని విర్రవీగుతున్న బీజేపీకి రెండంకెల స్థాయిలో కూడా సీట్లు రావని ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…