ఒక బృందావనం చిత్రం నుంచి లిరికల్ వీడియో సాంగ్ విడుదల Lyrical Video Song Pasi Pasi Taname Released from Oka Brindavanam
ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్ అండ్ హార్ట్‌టచ్చింగ్ సాంగ్ ఒకటి ‘ఒక బృందావనం’ నుంచి విడుదలైంది. పసి పసి తనమే…ఎలా.. పరుగులు తీసే ఏరులా అని కొనసాగే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత ఆస్కార్ అవార్డ్ విన్నర్ చందబ్రోస్ సాహిత్యాన్ని అందించారు. చిన్మయ శ్రీపాద ఆలపించిన ఈ పాటకు సన్ని అండ్ సాకేత్ స్వరాలను అందించారు. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. తాజాగా విడుదల చేసిన ఈ పాట అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఎంతో హాయిగా కొనసాగే ఈ పాట థియేటర్లో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతినిస్తుంది. ఈ చిత్రంలో వినోదంతో పాటు మంచి అర్థవంతమైన సందేశాన్ని కూడా ఈ చిత్రంలో జోడించాం. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న మా చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనేట్రైలర్ను తీసుకవస్తాం. తప్పకుండా కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి, ఎడిటర్లు తమ్మిరాజు మరియు సంతోష్ కామిరెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను మెరుగుపరిచారు మరియు సంగీత దర్శకులు సన్నీ మరియు సాకేత్ ఆహ్లాదకరమైన సౌండ్‌ట్రాక్‌ను అందించారు. చంద్రబోస్, రామజోగై శాస్త్రి, శ్యామ్ కాసర్ల, శ్రీనివాస మౌళి మరియు కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యంతో, ఈ పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి
Bollineni Krishnaiah: భారతీయ నాగరికతలకు మూలమైన సంస్కృతిని, సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని సంరక్షించుకోకపోతే రేపటి తరాలకు బలమైన పవిత్ర జీవన…
Sreemalika: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ వ్యాఖ్యానం, అపూర్వమైన పురాణేతిహాస కథా…
Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా…
Puranapanda Srinivas: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం, గణపతి…
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకున్న మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కెజియఫ్, సలార్…