Cinema

‘ఈ రోజుల్లో’.. మా జీవితాల‌ను మార్చేసింది

ఇప్ప‌డు రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే 2012, మార్చి 23న విడుద‌లై యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ కుర్ర‌కారుని ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల‌కు మ‌ళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావ‌డం విశేషం. ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ట్రెండ్‌సెట్ట‌ర్ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మ‌ళ్లీ చూడాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. గుడ్ సినిమా గ్రూప్‌ బ్యానర్ పై క్రియేటివ్ ద‌ర్శ‌కుడు మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు. ఎస్‌కేఎన్‌, శ్రేయాస్ శ్రీ‌నివాస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం రేపు విడుద‌ల కానున్న సంద‌ర్బంగా పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ… సినిమా విడుద‌లైన 12 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌ళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. చాలా చిన్న బ‌డ్జెట్‌తో స‌ర‌దాగా చేసిన సినిమా ఇది. మా జీవితాల‌ను మార్చిన సినిమా ఇది. గ‌త 12 సంవ‌త్స‌ర‌లుగా మా ముగ్గురి జ‌ర్ని కూడా ఎంతో స‌క్సెస్‌ఫుల్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా వుంటుంది. అందుకే ఎస్‌కేఎస్‌, శ్రీ‌నివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమ‌రీస్‌ను అంద‌రికి గుర్తు చేస్తే బాగుంటుంద‌ని ఈ చిత్రాన్ని మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నాం. 12 సంవ‌త్స‌రాల క్రితం విడుద‌లైన సినిమా మ‌ళ్ళీ ఇప్ప‌డు బిగ్ స్కీన్‌పై చూసుకోవ‌డం చాలా సంతోషంగా వుంది. మా లైఫ్‌లు టర్న్ చేసిన సినిమా ఇది. ఈ స్వీట్ మొమెరీని అందరూ మ‌రోసారి గుర్తు చేసుకుని  సినిమాను చూసి మ‌ళ్లీ ఆనందించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఎస్‌కేఎన్ మాట్లాడుతూ… మా ముగ్గురి కెరీర్‌లో ఇది చాలా ప్ర‌త్య‌క‌మైన సినిమా. పీఆర్ ఓగా వున్న న‌న్ను నిర్మాత‌ను చేసిన సినిమా ఇది. మా అంద‌రిని బిజీ చేసిన ట్రెండ్‌సెట్ట‌ర్ సినిమా ఇది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మారుతి లాంటి ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడిని అందించిన సినిమా ఈ రోజుల్లో. ఆ రోజున మొద‌లైన మా ప్ర‌యాణంలో అంద‌రికి మంచి కెరీర్‌ను ఇచ్చిన సినిమా ఇది. ఈ రోజుల్లో నుంచి బేబీ వ‌ర‌కు నిర్మాత‌గా నాప్ర‌యాణం, ద‌ర్శ‌కుడిగా మారుతి  ప్ర‌స్థానం, శ్రీ‌నివాస్ కెరీర్ ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతుంది. ఇది కేవ‌లం రిరిలీజ్ మాత్ర‌మే కాదు. పుష్క‌ర కాలంలో మా కెరీర్‌లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా. ఈ సినిమా విడుద‌లైన త‌రువాత సినీ ప‌రిశ్ర‌మ‌లో 50 ల‌క్ష‌ల‌తో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్ర‌తిభ‌ను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల స‌హ‌కారం అందించారు. ఇలాంటి సినిమా మ‌ళ్లీ వెండితెర‌పై చూసుకోవ‌డం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత శ్రేయాస్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ ఇది మా ముగ్గురి ఎమోష‌న‌ల్  జ‌ర్ని, కేవ‌లం 50 ల‌క్ష‌ల‌తో చేసిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దర్శ‌కుడు మారుతి అప్ప‌ట్లోనే కంటెంట్ ఈజ్ కింగ్ అని న‌మ్మి ఈ సినిమా తీశాడు. మా ప్ర‌మోష‌న్‌తో సినిమాను మ‌రింత జ‌నాల్లోకి తీసుక‌వెళ్లాం. ఈ సినిమా ఇన్‌స్పిరేష‌న్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇలాంటి స్వీట్ మెమెరీస్ గుర్తు చేసుకుంటూ ఈసినిమా ను మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డం సంతోషంగా వుంది అన్నారు.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM