Featured

పెళ్లికి వెళ్తే ఆధార్ కార్డు చేతికిచ్చారు.. అసలు విషయం ఏంటంటే?

న్యూఢిల్లీ: పెళ్లి అనేది సాధారణంగా జీవితంలో ఒకేసారి వచ్చే పండుగ. అందుకే దీన్ని ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని జంటలన్నీ కోరుకుంటాయి. ఇటీవలి కాలంలో చాలా జంటలు.. తమ పెళ్లిని వినూత్నంగా చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. కొందరు ఆకాశంలో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు నడి సముద్రంలో చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ జంట తమ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలని డిసైడ్ అయింది. దీని కోసం తమ బుర్రలకు బాగా పదును పెట్టింది. ఆ తర్వాత ఓ వింత నిర్ణయం తీసుకుంది. తమ పెళ్లిలో అతిథులకు వడ్డించే ఆహార పదార్థాల లిస్టును ఆధార్ కార్డ్ తరహాలో ముద్రించింది. ఇది వింతగా ఉండటంతో వీళ్లు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు ఎవరీ జంట? అంటే వీళ్లిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలోని రాజర్హాట్ ప్రాంత వాసులైన గొగోల్ సాహా, సుబర్న దాస్ జంట.. ఈ నెల 1న పెళ్లితో ఒక్కటైంది. అయితే వీరి పెళ్లికన్నా కూడా వీరి వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డ్‌ బాగా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే దీన్ని ఆధార్ కార్డ్ మోడల్‌లో తయారు చేశారు. దీన్ని గమనించిన ఓ అతిథి.. ఇదేదో బాగుందే అని ఆ కార్డును ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి దానిని అందరూ మెచ్చుకుంటున్నారు. దీనిని గమనించిన ఆ దంపతులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ ఆలోచనకు ఇంత గొప్పగా ప్రచారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంతమంది దీన్ని షేర్ చేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు.

సాహా మాట్లాడుతూ.. తామిద్దరం డిజిటల్ ఇండియాను సమర్థిస్తామని చెప్పారు. ఇలా వెడ్డింగ్ ఫుడ్ మెనూ కార్డును ఆధార్ కార్డులా ప్రింట్ చేయించాలనే ఆలోచన తన భార్య సుబర్నకు వచ్చిందని సాహా వెల్లడించారు. డిజిటల్ ఇండియాకు మద్దతుగా ఏం చేయాలా? అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్డును చూసి చాలా మంది షాకయ్యారని, పెళ్లిళ్లకు వెళ్లాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారా? అని అడిగారని సాహా దంపతులు నవ్వుతూ చెప్పారు. కొందరైతే డైనింగ్ టేబుల్ మీద ఆధార్ కార్డు వదిలేశావా? అంటూ సరదాగా జోకులు కూడా వేశారని తెలిపారు.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM