Featured

గాల్లో తేలుతున్న పడవ.. ఫొటోలు వైరల్!

ఓడలు సముద్రంలో వెళ్తాయని మనకు కచ్చితంగా తెలుసు. అయితే ఎప్పుడైనా గాల్లో తేలుతున్న ఓడను చూశారా? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే అడిగిన వాళ్లకు మతిస్థిమితం ఉందా? అని మనకు డౌట్ రావడం సహజం. కానీ ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా ఓడ నిజంగా గాల్లో ఎగర్లేదు లెండి. ఆ విషయంలోనే ఇక్కడ ఓ మాయ జరిగింది. అదేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లి పోవాల్సిందే.

అది ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతం. హెల్‌స్టన్‌లోని గిలియన్ ప్రాంతం నుంచి సముద్రంలోకి చూస్తున్నాడు డేవిడ్ మోరిస్ అనే వ్యక్తి. అప్పుడే అతనికి దిమ్మతిరిగి పోయే ఘటన కనిపించింది. అదేంటంటే.. అతను చూస్తున్న సముద్రంలో దూరంగా ఒక ఓడ గాల్లో తేలుతూ నెమ్మదిగా ముందుకు సాగిపోతోంది. అది చూసిన డేవిడ్‌కు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది. వెంటనే ఆ వింత దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే విపరీతంగా వైరల్ అయిపోయింది. పైన నీలి రంగు ఆకాశం, కింద నీలి రంగు సముద్రం మధ్యలో గాల్లో రెంటికీ సంబంధం లేనట్లు ఎరుపు, తెలుపు రంగులతో ఉన్న ఓడ. ఇదీ అతని కెమెరాలో చిక్కిన దృశ్యం. అయితే ఇక్కడ ఓడ నిజంగా గాల్లో తేలడం లేదని నిపుణులు వివరించారు. ఇలాంటి ఘటనలను రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్లూజన్లు అంటారని వెల్లడించారు. అంటే అక్కడ ఉన్న విషయం వేరు, మనకు కనిపిస్తున్న చిత్రం వేరు అయిందన్నమాట. ఇంతకీ ఈ ఓడ గాల్లో తేలుతున్నట్లు ఎందుకు కనిపిస్తుందో తెలుసా? మేఘాల వల్ల అని కొందరు అంటున్నారు. భూమికి చాలా దగ్గరగా ఉండే మేఘాలు ఆ ప్రాంతంలో సముద్రం నీటి రంగును మార్చేసి ఉండొచ్చని, దీంతో మనకు ఓడ గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోందని కొందరు చెప్తున్నారు.

కొందరేమో ఆ మేఘాలు ఓడ కింది భాగాన్ని కప్పేసి ఉండొచ్చని వాళ్లు చెప్తున్నారు. మరికొందరేమో సదరు ఓడ ఉన్న ప్రాంతంలో అసలు మేఘాలే లేకపోవడంతో ఆకాశం, సముద్రాన్ని ప్రతిబింబించి ఉండొచ్చని అంటున్నారు. అలా జరిగినా కూడా మనకు పడవ గాల్లో తేలుతున్నట్లే కనిపిస్తుందట. ఇక్కడ ఏం జరిగిందో కచ్చితంగా అయితే చెప్పలేం కానీ, జరిగింది చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM