Featured

Puranapanda Srinivas: ఏప్రిల్ 4న అభయ గణపతి ఆలయాలకు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌చే అఖండ పూజార్చనలు

సికింద్రాబాద్, ఏప్రిల్ 2: Puranapanda Srinivas- జంటనగరాలలో ఇరవైఒక్క అభయ గణపతి ఆలయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అతి అరుదైన కృష్ణశిలతో వివిధ ప్రాంతాల్లో నిర్మితమయ్యే ఈ ఆలయాలకు ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ ఆలయనిర్మాణ పూజలు నిర్వహిస్తారు.

ఇరవై ఒక్క ఆలయాల్లో మొదటిగా హైదరాబాద్ త్యాగరాయగానసభలో నిర్మితమైన అభయగణపతి ఆలయానికి శృంగేరి పండితుల వైదిక మంత్రశబ్దాలమధ్య ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఏప్రిల్ 4న పూజార్చనలు నిర్వహిస్తారని త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి తెలిపారు.

Sri Abhayaganapthi

రెండున్నర అడుగుల ఎత్తు, వెడల్పుతో, అరుదైన పవిత్ర కృష్ణ శిలతో ఈ అభయగణపతి శిల్పాన్ని తమిళనాడులో తయారు చేయించినట్లు జనార్ధనమూర్తి చెప్పారు.

వందల, వేల కళాకారులకు, రచయితలకు, నాట్యకారిణులకు, గాయనీ, గాయకులకు ముఖద్వారంగా సుమారు ఆరు దశాబ్దాల కీర్తిని జాతీయ స్థాయిలో మూట కట్టుకున్న త్యాగరాయగాన సభలో ఇలాంటి దైవీయ కార్యక్రమానికి తెరతీయడంపట్ల పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు.

Puranapanda Srinivas

ఈర్ష్యాసూయలు, కపటం, కల్మషాలు మన దగ్గరకి చేరనివ్వద్దని ప్రతీ సభలో అద్భుతమైన కథలతో హెచ్చరించే పురాణపండ శ్రీనివాస్ మానవ విలువలకు పెద్దపీట వేస్తారని తెలుగు రాష్ట్రాల్లో వేలకొలది భక్త రసజ్ఞులకు తెలుసున్న అంశమే! భారతీయ వైదిక, ధార్మిక అంశాలకు చెందిన పరమసత్యాల గ్రంధాలతో దూసుకుపోతున్న పుస్తక మాంత్రికునిగా పురాణపండ శ్రీనివాస్ ఈ అభయ గణపతి మంగళ కార్యానికి హాజరవ్వడం గణపతి భగవానుని విశేష అనుగ్రహంగా మేధో సమాజం పేర్కొనడం గమనార్హం.
ఈ అభయగణపతి ప్రతిష్టాపనలో తమను ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య తదితరులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM