Featured

ఐపీఎల్ వేలంలో పేరు లేకపోవడంపై.. స్టార్ పేసర్ స్పందన ఇదీ!

IPL auction: ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు, ప్లేయర్లందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. దీని కోసం చాలా దేశాల క్రికెట్ బోర్డులు తమ షెడ్యూల్ ఖాళీ చేసుకుంటాయనే సంగతి తెలుసు కదా. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఐపీఎల్‌లో ఫిక్సింగ్ చేసి నిషేధానికి గురైన భారత పేసర్ శ్రీశాంత్ గుర్తున్నాడా? ఇదిగో ఇన్నేళ్ల తర్వాత బీసీసీఐ నిషేధం తొలగించినా అతని పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.

2021లో జరగబోయే ఐపీఎల్‌లో అతను కచ్చితంగా ఆడతాడని చాలా మంది భావించారు. అయితే ఈ లీగ్‌ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో శ్రీశాంత్ పేరు లేదు. ఇలా ఐపీఎల్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఈ కేరళ స్పీడ్‌స్టర్ పెదవి విప్పాడు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా ఐపీఎల్ ఆడతానని శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 ఆడాలని శ్రీశాంత్ చాలా తహతహలాడాడు. దీని కోసమే లీగ్‌ వేలంలో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. తన బేస్ ధరగా 75 లక్షల రూపాయలు ఆశించాడు. అయితే చివరి నిమిషంలో శ్రీశాంత్‌కు బీసీసీఐ నుంచి భారీ షాక్ తగిలింది. తుది జాబితాలో అతడి పేరు లేకుండా చేసింది.

ఫ్రాంచైజీలు ఏవీ శ్రీశాంత్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదని, అందుకే అతడి పేరును నమోదు చేయలేదని బీసీసీఐ పేర్కొంది. దీనిపై స్పందించిన శ్రీశాంత్.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడలేక పోతున్నందుకు తాను బాధపడడం లేదని చెప్పాడు. అయితే వచ్చే ఏడాది ఆడతాననే నమ్మకం ఉందని, ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటానని వెల్లడించాడు. మళ్లీ ఇలా క్రికెట్ ఆడటం కోసం 8 ఏళ్లు ఎదురు చూశానని, మరో ఏడాది ఎదురు చూడటం పెద్ద శ్రమ కాదని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఏడాది ఐపీఎల్ ఎప్పటిలానే మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM